ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కోఆర్డినేషన్ ఐజీ బి. రాజకుమారి వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు 607 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా 213 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 1,785 మందికి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.

బీఎన్ఎస్ఎస్ సెక్షన్లు 126/129 కింద 25,207 బైండోవర్ కేసులు నమోదు చేసి 1,41,687 మందిని బైండోవర్ చేసినట్లు ఐజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 37,942 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 9,337 ఆయుధాలను డిపాజిట్ చేయించామని 3,548.4 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం

చేసుకున్నామని వెల్లడించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఐజీ రాజకుమారి సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు లేదా అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *