ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు-2026 నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 23 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలో నాలుగు మేయర్ 19 ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ స్థానాలన్నింటికీ పోటీ ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. నాలుగు మేయర్ పదవుల కోసం 36 మంది 19 ఛైర్‌పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,010 వార్డు సభ్యుల స్థానాలకు గానూ 41 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో ఐదు వార్డుల్లో పోటీ లేకపోవడంతో మిగిలిన 964 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.

నాలుగు కార్పొరేషన్లలో రెండు 19 మున్సిపాలిటీలు నగర పంచాయతీల పరిధిలో 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మేయర్, ఛైర్‌పర్సన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 1,009 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్ వార్డుల్లో 911 మంది మున్సిపల్ వార్డుల్లో 2,057 మంది కలిపి మొత్తం 2,968 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 24,98,312 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 12,04,819 మంది పురుషులు, 12,93,084 మంది మహిళలు, 409 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 2,801 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా ఏకగ్రీవ వార్డులను మినహాయించి 2,698 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది.

వీటిలో 819 సమస్యాత్మక, 597 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున మొత్తం 5,602 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు కౌంటింగ్ హాళ్ల వద్ద అదనంగా 183 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *