ఏపీ మంత్రి పేరుతో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖ.. తిరుమల వెళ్లిన భక్తులకు ఊహించని షాక్

Date:

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.

ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు జారీ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి పేరుతో లేఖలు జారీ అవుతున్నాయని బాధితులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొందరు వ్యక్తులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ సిఫారసు లేఖలు సృష్టిస్తున్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖల అంశంపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్‌ కమిషనర్‌, నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిఫారసు లేఖల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...