హైదరాబాద్‌లో వైసీపీ కీలక నేత అరెస్ట్.. న్యూస్ ఛానల్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు కొంప ముంచాయి

Date:

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుపై, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. కర్నూలు బస్సు ప్రమాదంపై చేసిన వ్యాఖ్యలు, తిరుమల పరకామణి కేసు ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగిందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లో ఏపీకి చెందిన వైఎస్సార్‌సీపీ నేత అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని తాడిపత్రి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. ఏపీలో వెంకట్‌రెడ్డిపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నెల 14న తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీశ్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అనంతపురం తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్‌ పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాం కనిపించింది.. ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. సతీశ్ కుమార్ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఏపీ ఇండియన్ బెస్ట్ ఫార్మర్ అవార్డ్

https://www.youtube.com/shorts/aUiZDGh1IJY?feature=share D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్‌కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక...

Headache Causes: రోజూ తలనొప్పి వస్తుందా? ఈ చిన్న కారణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

తలనొప్పి అప్పుడప్పుడు రావడం సాధారణమే. అయితే కొందరిని మాత్రం తరచూ, కొన్ని...

తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక నేతలతో జగన్ భేటీ

https://youtu.be/7sVrEcCAR5Q తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌...

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...