విజయవాడలో బోటింగ్.. ఈ రూట్‌లో జాలీ ట్రిప్.. ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు

Date:

ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేందుకు కీలక ముందడుగు వేసింది. విజయవాడలోని పున్నమిఘాట్‌-భవానీ ఐలాండ్‌ మధ్య రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌కు అనుమతించింది. జలవనరులశాఖ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. బోటింగ్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూనే.. కొన్ని నిబంధనలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఏపీటీడీసీదేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడలో పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, విజయవాడలో బోటింగ్‌కు జలవనరులశాఖ షరతులతో పరిమితమైన అనుమతించింది. మొత్తం 25 షరతులతో ఎన్వోసీ జారీ జారీ చేయగా.. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ వరకు ప్రతి రోజూ రాత్రి 10 గంటల వరకు బోటింగ్‌‌కు వెళ్లొచ్చు. ప్రకాశం బ్యారేజీ గేట్ల నిర్వహణ, నీటి విడుదలకు ప్రాధాన్యం ఉంటుందని జలవనరులశాఖ తెలిపింది. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే.. ఆ సమయంలో ముందస్తు సమాచారం లేకుండానే బోటింగ్ నిలిపివేసే అధికారం ఉంటుందని కూడా షరతుల్లో పేర్కొంది.

బోటింగ్‌కు వచ్చే పర్యాటకుల భద్రతకు సంబంధించిన బాధ్యత ఏపీటీడీసీదేనని తేల్చి చెప్పింది జలవనరులశాఖ. ఈ బోటింగ్ వల్ల మత్స్యకారుల హక్కులకు భంగం కలగకూడదని.. పర్యాటకులు నదిలో వ్యర్ధాలను వేయకుండా చూడాలని సూచించారు. ఈ బోటింగ్ కేవలం పున్నమిఘాట్‌-భవానీ ఐలాండ్‌ వరకు ఉంటుందని.. ఆ ప్రాంతాన్ని దాటి బోట్లు వెళ్లకూడదని సూచించారు. అలాగే బోటింగ్ కోసం అధికారికంగా గుర్తించిన జెట్టీలను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. బోట్లు ప్రకాశం బ్యారేజీ వెయ్యి మీటర్ల ఎగురు పరిధిలోకి రాకూడదని కూడా జలవనరులశాఖ తెలిపింది. బోట్లలో మద్యం, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్ధాలు కూడా అనుమతించరు. అవసరమైన సమయంలో జలవనరుల శాఖ తనిఖీలకు సహకరించాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...