నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు..

Date:

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన పిటిషన్‌కు మూడు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోనియా, రాహుల్‌తో పాటు సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ ప్రతినిధులకు కూడా నోటీసులు ఇచ్చింది (National Herald case).

జస్టిస్ మనోజ్ జైన్ నేతృత్వంలోని ధర్మాసనం.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. కాగా, ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీస్ ఎఫ్‌ఐఆర్ లేకుండా ఈడీ కేసు ముందుకు సాగదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు (Sonia Gandhi ED case).

2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దాఖలు చేశారు (Rahul Gandhi ED petition). తర్వాత ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. 2025లో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దిగువ కోర్టు ఆ ఛార్జ్‌షీట్‌ను స్వీకరించేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...