కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం.. అజయ్ ప్రతిభకు నిదర్శనం: మంత్రి

Date:

అమరావతి, జులై 28: గ్లాస్గో వేదికగా జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో అజయ్ అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

కామన్వెల్త్ గేమ్స్ రికార్డుతో పాటు రజత పతకం సాధించడం అజయ్ బాబు ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భవిష్యత్తులో క్రీడాకారులు. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...