ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వస్తే.. మహిళతో చాటుమాటు యవ్వారం.. జూబ్లీహిల్స్ సీఐపై వేటు!

Date:

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీఐని బదిలీ చేశారు. బాధితురాలి ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీఐని బదిలీ చేశారు. బాధితురాలి ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సీఐ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. అంతేకాకుండా ఆ ఘటనను వీడియోగా చిత్రీకరించి, వాటిని అడ్డం పెట్టుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆరోపించింది. బెదిరింపులతో పాటు తన నుంచి దాదాపు రూ.2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడని, అందుకు సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీల ఆధారాలను కూడా డీజీపీకి సమర్పించినట్లు ఫిర్యాదులో వెల్లడించింది.

సీఐ కారణంగా తాను గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించాడని, ఆస్పత్రి రికార్డుల్లో తన ఫోన్ నంబర్ నమోదు చేయించినట్లు కూడా బాధితురాలు పేర్కొంది. అలాగే హైదరాబాద్ పోస్టింగ్ కోసం సీఐ రూ.25 లక్షలు ఖర్చు పెట్టుకున్నట్లు తనతో చెప్పాడని ఫిర్యాదులో ఆరోపించింది. తాను నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారని కూడా బాధితురాలు ఆరోపించింది. దీంతో నేరుగా డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...