భోగాపురం విమానాశ్రయం: ఎగిరే చేప డిజైన్ వెనుక అంత కథ ఉందా..?

Date:

విజయనగరం జిల్లాలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్ట్ ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ప్రత్యేకతలు, డిజైన్ గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ డిజైన్‌ను.. ఎగిరే చేప ఆకృతిలో ఎందుకు నిర్మించారనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.


భోగాపురం ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం.. సముద్రతీర ప్రాంతం. బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్కృతి, తీర ప్రాంత ప్రాముఖ్యత, మత్స్య సంపద అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఎంచుకున్నారు. సముద్ర చేప ‘ఎక్సోకోయేటస్’ను ఫ్లయింగ్ ఫిష్‌గా పిలుస్తారు. ఈ చేప నీటిలో ఈదుతూనే పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలం నుంచి గాల్లోకి ఎగిరి ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ రకంగా నీరు, ఆకాశాన్ని కలిపే సంకేతంగా కనిపిస్తుంది. విమానాలు కూడా నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగిరి ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే విమానయానాన్ని, బంగాఖాఖాతం మత్స్యసంపదను ప్రతిబింబించేలా ఈ ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఎంచుకున్నారు.

ఎగిరే చేప తరహాలో.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా పర్యాటకం, ఎగుమతుల రంగంలో దూసుకెళ్లాలనే ఆకాంక్షకు కూడా ఈ ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఓ కారణంగా భావించవచ్చు. ఇక భోగాపురం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ఎయిర్ పోర్టు.. టెర్మినల్ సీలింగ్ కూడా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా.. రంగవల్లులలో ఏర్పాటు చేశారు. భోగాపురం తీర ప్రాంతం కావడంతో తుఫానులు, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో వీటిని తట్టుకునేలా 21 మీటర్ల గ్లాస్ ఫాసాడ్ నిర్మాణం, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి టెర్మినల్ నిర్మించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...