
తెలంగాణను విద్యారంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో 9 శాతం నిధులను విద్యారంగానికే కేటాయిస్తున్నామని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం విద్యాశాఖను స్వయంగా తన వద్దే ఉంచుకున్నానని చెప్పారు.
విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతి ఏడాది 10 నుంచి 12 మంది ఉపాధ్యాయులను స్టడీ లీవ్‌పై విదేశాలకు పంపనున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి మండలాన్ని విద్యా క్లస్టర్‌గా అభివృద్ధి చేసి, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా రాజకీయాలపై స్పందించిన సీఎం.. “2034 వరకు నేనే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతాను” అని ధీమా వ్యక్తం చేశారు.

