యువతకు ISRO పిలుపు.. శాటిలైట్ సెంటర్‌లో 410 ఉద్యోగాలు! నేరుగా డిగ్రీ మార్కులతోనే కొలువు సొంతం

Date:

ISROకు చెందిన యు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరులో అప్రెంటిస్‌ శిక్షణకు భారీ అవకాశాలు వచ్చాయి. 2026–27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ విభాగాల్లో మొత్తం 410 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా డిగ్రీ మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన UR రావు శాటిలైట్ సెంటర్ (URSC), బెంగళూరులో అప్రెంటిస్‌ శిక్షణ కోసం భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2026–27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌, కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ విభాగాల్లో మొత్తం 410 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 28, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, కెమికల్‌, ఇండస్ట్రియల్‌, ఆటోమొబైల్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌, డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టిస్‌ తదితర విభాగాల్లో అప్రెంటిస్‌ అవకాశాలు ఉన్నాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (BE/B.Tech) పోస్టుల సంఖ్య: 220
  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (డిప్లొమా) పోస్టుల సంఖ్య: 120
  • కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ పోస్టుల సంఖ్య: 70

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/B.Tech పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక కమర్షియల్‌ ప్రాక్టిస్‌ అప్రెంటిస్‌ పోస్టులకు డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టిస్‌ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 2022, 2023, 2024, 2025, 2026 సంవత్సరాల్లో తప్పనిసరిగా అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 2021 కంటే ముందు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్ 28, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ స్టైపెండ్‌ అందిస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. అంటే ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే నేరుగా డిగ్రీ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ రూ.12,300, టెక్నీషియన్‌/డిప్లొమా అప్రెంటిస్‌ రూ.10,900 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ముందుగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం UMANG పోర్టల్‌లో URSC అప్రెంటిస్‌షిప్‌ను సెర్చ్‌ చేసి దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో NATS ద్వారా పొందిన ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌/అప్రెంటిస్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇంజినీరింగ్‌, డిప్లొమా పూర్తి చేసిన యువతకు ISROలో శిక్షణతో పాటు పరిశ్రమ అనుభవం పొందేందుకు ఈ అప్రెంటిస్‌షిప్‌ మంచి అవకాశంగా మారనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...