
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, యూత్ స్టార్ నితిన్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ‘కోర్ట్’ చిత్రంతో నిర్మాతగా ఘన విజయాన్ని అందుకున్న నాని, తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘దండోరా’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన మురళి కాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆకట్టుకునే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేసింది. టైటిల్‌తో పాటు వీడియోను బట్టి చూస్తే, ఇది క్లాసిక్ టచ్‌తో కూడిన ప్లెజెంట్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల వరుసగా మాస్, యాక్షన్ కథలను ఎంచుకున్న నితిన్.. ఈసారి తనకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్-కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్‌లోకి తిరిగి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాదు, నితిన్‌కు బలమైన కంబ్యాక్ ఇచ్చే కథ ఇదేనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
విభిన్నమైన కథలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చే నాని, ఈ కథ నచ్చడంతో స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. నిర్మాతగా ఇప్పటివరకు విజయవంతమైన చిత్రాలను అందించిన నానిపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. దీంతో నితిన్, నాని, మురళి కాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

