పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

Date:

మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్, రాచర్ల బీట్‌లో ఉన్న గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులును గుంటూరు జిల్లా మేడికొండూరులో అరెస్ట్ చేశారు.

ఆపై వారిద్దరినీ గిద్దలూరుకు తరలించారు. పెద్దపులి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సీరియస్ అయిన విషయం తెలిసిందే. పారదర్శక విచారణ చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 20 రోజుల క్రితం మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో ఉచ్చులో పడి పెద్దపులి మృతి చెందింది. కొందరు వ్యక్తులు పులి కాళ్లను నరికి గోళ్లను ఎత్తుకుపోవడం కలకలం రేపింది.

పులి మరణంపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పెద్దపులి మృతి ఆదోళన కలిగించిందన్నారు. పులి మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. పులిది సహజ మరణమా, వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం జరిగిందా అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో విస్తృతంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...