శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 100 టీఎంసీలకు చేరువలో..

Date:

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం జూరాల ప్రాజెక్టు నుంచి 2.21 లక్షల క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేశారు. రాత్రి సమయానికి శ్రీశైలానికి 1.55 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరింది.

రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా ప్రవాహ ఉధృతి మరో నాలుగైదు రోజులు కొనసాగవచ్చని శ్రీశైలం డ్యాం సీఈ కబీర్‌ బాషా తెలిపారు. ఎగువన కర్ణాటకలో ఆలమట్టికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1.50 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్‌కు 1,28,954 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 1,40,880 క్యూసెక్కులు వదిలారు. వీటికి భీమా నది వరద జలాలు కలుస్తున్నాయి. దీంతో జూరాలకు మొత్తం 1.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో ఉంచుకొని 2,21,765 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంలోకి సోమవారం 57,785 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాలువలకు 1390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 136 టీఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తున్నాయి. పులిచింతలలో సోమవారం 28.91 టీఎంసీల నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 6958 క్యూసెక్కులు వస్తుంటే 6499 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...