కిడ్నాప్ కేసు గుజరాత్‌‌లో వైసీపీ నేత ముస్తఫా అరెస్ట్

Date:

అమరావతి, ఆగస్టు 4: గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ముస్తఫా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గుజరాత్‌లో ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి నిర్భంధించారంటూ వైసీపీ నేతపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముస్తఫా కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సాంకేతిక పరిజ్ఞానంతో గుజరాత్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడకు చేరుకుని వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ముస్తఫా అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించారు. ఇటీవల పొగాకు లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. పొగాకు వ్యాపారి‌తో పాటు మరొకరిని బలవంతంగా కిడ్నాప్ చేసి, నిర్బంధించారు.

బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌కు గురైన వారిని రక్షించిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముస్తఫా కుమారుడిపై కిడ్నాప్ కేసును నమోదు చేశారు. అంతేకాకుండా కిడ్నాప్‌‌లో ముస్తఫా హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిపై కూడా కిడ్నాప్, బెదిరింపుల కేసు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ముస్తఫా కనిపించకుండా పోయారు. వైసీపీ నేత కోసం గాలించిన పోలీసులు చివరకు ఆయనను గుజరాత్‌లో అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...