SHG loans: మహిళా సంఘాలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. బ్యాంక్ రుణాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

Date:

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రామీణ బ్యాంకుల్లో మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఏడాదికి సగటున రూ.25,000 వరకు ఆదా కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆర్థికంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు అండగా నిలిచేందుకు ఏపీ సర్కార్ మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ బ్యాంకుల్లో వారు పొందే రుణాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కీలక మినహాయింపులు ప్రకటించింది. బ్యాంకులు వసూలు చేసే సర్వీస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, పెద్ద మొత్తంలో తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.

ఇకపై రూపాయి కూడా సర్వీస్ ఛార్జ్ ఉండదు!

ఇప్పటివరకు మహిళా సంఘాలు గ్రామీణ బ్యాంకుల నుంచి రుణాలు పొందే సమయంలో అనేక రకాల సేవా రుసుములు చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఇవన్నీ రద్దు కానున్నాయి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇన్స్‌పెక్షన్ రుసుము, పాస్‌బుక్, లెడ్జర్, క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలను కూడా ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. వీటిని రద్దు వల్ల ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఏడాదికి సగటున రూ.25,000 వరకు ఆదా కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రూ.5 లక్షలు దాటితే తగ్గనున్న వడ్డీ

మహిళలు వ్యాపార రీత్యా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటే వారిపై పడే వడ్డీ భారాన్ని సైతం ప్రభుత్వం తగ్గించింది. రూ.5 లక్షలకు పైబడిన రుణాలపై ఇప్పటివరకు ఉన్న 13 శాతం వడ్డీ రేటును 12 శాతానికి తగ్గించారు. దీనివల్ల పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు నెలవారీ ఈఎంఐ (EMI) వార్షిక వడ్డీ భారం గణనీయంగా తగ్గనుంది.

2.75 లక్షల మహిళా సంఘాలకు నేరుగా లబ్ధి!

ప్రభుత్వ నిర్ణయాల ద్వారా రాష్ట్రంలోని వివిధ గ్రామీణ బ్యాంకులతో అనుసంధానమై ఉన్న సుమారు 2.75 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది.

మహిళా సాధికారతే లక్ష్యం!

మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడం, వారి ఉపాధి, వ్యాపార కార్యకలాపాలకు కొండంత అండగా నిలవడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. డ్వాక్రా ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పిస్తున్న ఈ సమయంలో, రుణాలపై సర్వీస్ ఛార్జీల రద్దు మరియు వడ్డీ తగ్గింపు నిర్ణయాలు మహిళా సంఘాల ఆదాయ వృద్ధికి, వారి ఆర్థిక బలోపేతానికి ఎంతగానో దోహదపడనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...