వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్.. కిడ్నాప్ కేసులో గుజరాత్‌లో పట్టుకున్న పోలీసులు

Date:

వైఎస్సార్ సీపీ నేత, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పొగాకు వ్యాపారం లావాదేవీల విషయంలో ఓ వ్యాపారి కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారంలో ముస్తఫా కొడుకు బషీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో ముస్తఫా పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించి ఆయన్ను కూడా అరెస్టు చేశారు. గుజరాత్‌లో ఉన్న ముస్తఫాను అరెస్టు చేసినట్లు నూజివీడు పోలీసులు తెలిపారు.

గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా నడుస్తున్న కిడ్నాప్ కేసు వ్యవహారంలో వైఎస్సార్ సీపీ నేత ముస్తఫాను నూజివీడు పోలీసులు గుజరాత్‌లో అరెస్టు చేశారు. పొగాకు వ్యాపారి కొడుకుతో పాటు మరొకరిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌పై నూజివీడు పోలీసులు కిడ్నాప్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల పొగుకు లోడుతో వెళ్తున్న వాహనాన్ని ముస్తఫా కుమారుడు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. పొగాకు వ్యాపారి కొడుకుతో పాటు మరొకరిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముస్తఫా హస్తం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయనపై కూడా కేసు నమోదు చేశారు.

పోలీసుల ప్రాథమిక వివరాల మేరకు.. ముస్తఫాకు గుంటూరులో ఒక పొగాకు గోదాము ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి, గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. ఇటీవల పొగాకు ధరలు తగ్గిపోవడంతో తనకు వ్యాపారం గిట్టుబాటు కావడం లేదంటూ సూర్యచంద్రం ముస్తఫాకు సరుకు అమ్మడం ఆపేసి, గుంటూరులోనే మరో కంపెనీకి విక్రయిస్తున్నారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...