చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌ పదవికి గండం.. రేసులోకి వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్..!

Date:

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగియనుండటంతో అతడి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై తలెత్తిన వివాదాల కారణంగా బీసీసీఐ అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్‌ను తప్పిస్తే, అతని స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని బోర్డు యోచిస్తోందట.

భారత క్రికెట్ నియంత్రణ మంఢలి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై సంశయం వ్యక్తమవుతోంది. అగార్కర్ కాంట్రాక్ట్ వచ్చే సెప్టెంబర్‌తో ముగియనుంది. సాధారణంగా 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడి సేవలను కొనసాగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన పరిణామాల పట్ల బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అగార్కర్.. పదవిని ఓసారి పొడిగించారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌లో జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే అగార్కర్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పలేం. ఎందుకంటే అగార్కర్ హయాంలో భారత్.. మంచి విజయాలు అందుకుంది. 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో.. టీమిండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో మూడేళ్లలో మూడు ఐసీసీ టైటిల్స్ అందుకుంది. అంతేకాకుండా రోహిత్, కోహ్లీ (టెస్టులు, టీ20లు), అశ్విన్, పూజారా, రహానే, జడేజా (టీ20లు) వంటి ప్లేయర్లు రిటైర్మెంట్ పలికినా.. జట్టు కూర్పును సెట్ చేశాడనే పేరు అగార్కర్‌కు ఉంది.

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ ఫలితాలు అగార్కర్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తనే కొనసాగాలని అగార్కర్ భావిస్తున్నప్పటికీ, సెప్టెంబర్‌లో జరిగే ఏజీఎం సమావేశం తర్వాతే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఒకవేళ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరిస్తే భారత క్రికెట్ సెలెక్షన్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...