పట్టులాంటి జుట్టు కోసం అమ్మమ్మలు, నానమ్మల నాటి చిట్కా, సాంబ్రాణి ధూపం వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు!

Date:

ఆధునిక కాలంలో జుట్టు ఆరబెట్టుకోవడానికి డ్రైయర్లు ఎంత పాపులర్‌ అయినా సరే మన అమ్మమ్మలు, నానమ్మలు అందించిన సాంబ్రాణి ధూపం ఇచ్చే ఆరోగ్యం, ఆ ప్రశాంతత వేరు. తలస్నానం చేసిన తర్వాత కుదుళ్లలో పేరుకుపోయే తేమను తొలగించి జలుబు, తలనొప్పి వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో ఇది అద్భుతమైన ఆయుర్వేద చిట్కా. కేవలం జుట్టుకు పట్టులాంటి మెరుపును, ఆహ్లాదకరమైన సువాసనను ఇవ్వడమే కాకుండా తలమాడుపై హానికర బ్యాక్టీరియా చేరకుండా ఇది కాపాడుతుంది. సంప్రదాయాన్ని, ఆరోగ్యాన్ని ఒకేసారి అందించే ఈ ప్రాచీన పద్ధతి ఈనాటి మోడ్రన్‌ లైఫ్‌స్టైల్‌కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు తలస్నానం చేసిన వెంటనే తడి జట్టుకు సాంబ్రాణి పట్టే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ఆడపిల్లలకు ఈ పని తప్పకుండా చేసే వారు. అయితే ఈ సంప్రదాయ పద్ధతి వెనుక కేవలం మంచి సుమాసన మాత్రమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. జట్టు త్వరగా ఆరడమే కాకుండా తలమాడుపై ఫంగస్‌ ఇన్ఫెక్షన్లు రాకుండా, జలుబు, సైనసైటిస్‌ లాంటి సమస్యలు దరిచేరకుండా ఇది కాపాడుతుంది.

అయితే ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల రసాయన ధూపాలు లభిస్తుండటంతో సహజ సిద్ధమైన సాంబ్రాణి ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే సాంబ్రాణి ధూపం వేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడంతో పాటు మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలో జుట్టు ఆరోగ్యానికి సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

తలస్నానం చేసిన తర్వాత జుట్టులో తడి ఉండటం వల్ల కొందరికి జలుబు, శ్లేష్మం పట్టడం లేదా సైకస్‌, తలనొప్పి వస్తుంది. సాంబ్రాణి పొగలోని వేడి తలలోని తేమను తగ్గించి జలుబు రాకుండా కాపాడుతుంది. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు చిన్న పిల్లలు స్నానం చేసిన వెంటనే సాంబ్రాణి పొగ పట్టేవారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...