Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్

Date:

భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు జట్టు మానసికంగా, శారీరకంగా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, తొలి రోజు నుంచే అత్యుత్తమ ప్రదర్శన చేయాలంటే ఇప్పటి నుంచే కఠినంగా శ్రమించాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుతం భారత జట్టు కొలంబోలోని ఎన్సీసీ మైదానంలో శిక్షణ శిబిరాన్ని కొనసాగిస్తోంది. ఆగస్టు 7 నుంచి 9 వరకు ఇదే వేదికలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా, అనంతరం గాలేకు చేరుకుని ఆగస్టు 15న శ్రీలంకతో తొలి టెస్టులో తలపడనుంది.

ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన గౌతమ్ గంభీర్.. “మన ముందున్న సవాలు ఎంత పెద్దదో ప్రతి ఒక్కరికీ తెలుసు. మన లక్ష్యం కూడా స్పష్టంగా తెలుసు. గతంలో కంటే మరింత కష్టపడి, ప్రతి అంశంలో సిద్ధంగా ఉండాలి. ఆగస్టు 15న మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచే బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా ప్రత్యర్థి విసిరే ప్రతి సవాలుకు మన దగ్గర సమాధానం ఉండాలి. అందుకే ఇప్పటి నుంచే అన్ని విభాగాల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి” అని ఆటగాళ్లకు సూచించాడు.

భారత టెస్టు జట్టులో కొత్తగా ఎంపికైన ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీలను గంభీర్ ప్రత్యేకంగా అభినందించాడు. అలాగే కొత్త ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్కు జట్టులోకి స్వాగతం పలికాడు. “సారాంశ్.. ఈ స్థాయికి చేరుకోవడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నీ కుటుంబంతో పాటు దేశానికి గర్వకారణంగా నిలవాలి. ఆకిబ్.. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచావు. జమ్మూ కశ్మీర్ జట్టు రణజీ ట్రోఫీలో విజయవంతమైన ప్రయాణంలో కీలక పాత్ర పోషించావు. నీకు అభినందనలు. అలాగే శుభదీప్ ఘోష్‌కు స్వాగతం. ఆయన అనుభవం, అంకితభావం ఈ జట్టుకు ఎంతో ఉపయోగపడతాయని విశ్వసిస్తున్నాను” అని గంభీర్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో, శ్రీలంక 41.67 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. దీంతో ఈ టెస్టు సిరీస్ ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై విజయం సాధించడం భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌లో విజయాలు నమోదు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో గంభీర్ ఇచ్చిన సందేశం టీమిండియా ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కనిపిస్తోంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...