చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం: పవన్ కల్యాణ్

Date:

అమరావతి, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు. ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతిని, చేతిపనితనాన్ని, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. చేనేతను ఎంచుకోవడం ద్వారా, దేశ సంప్రదాయాలను పరిరక్షించుకోవడంతో పాటు నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమన్నారు.

చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి, పరిరక్షించడానికి, సాధికారత కల్పించడానికి జనసేన పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో ప్రత్యేకంగా నేత కార్మికుల అభివృద్ధి విభాగాన్ని చేసినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పవన్ పేర్కొన్నారు. అర్హులైన నేత కార్మికులకు ఉచిత విద్యుత్, రూ.25,000 సహాయం అందించే ‘నేతన్న సేవలో’ పథకంతో సహా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశపు అమూల్యమైన చేనేత వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియో సందేశాన్ని కూడా డిప్యూటీ సీఎం ప్రస్తావించారు. ప్రతి భారతీయుడిని ముఖ్యంగా యువతను, కంటెంట్ క్రియేటర్లు చేనేత వస్త్రాలను ధరించి GRWM (గెట్ రెడీ విత్ మీ) వీడియోలను రూపొందించడం ద్వారా చేనేతకు ప్రాచుర్యం కల్పించాలని ప్రధాని పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతి భారతీయుడు చేనేతను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని నేత కార్మికులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నేత కార్మికులు, కళాకారులందరికీ పవన్ కల్యాణ్ హృదయపూర్వక జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ వారసత్వాన్ని కాపాడుకుందామని. దేశానికి గుర్తింపు తీసుకొస్తున్న నేత కార్మికులకు సాధికారత కల్పిద్దామని ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...