మార్కాపురం జిల్లా ప్రజల కరువు తీరినట్టే.. ఈ నెలాఖరుకే వెలిగొండ జలాలు?

Date:

మార్కాపురం జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ జలాలు త్వరలోనే మెట్ట భూముల్లో పారనున్నాయి. కరువు సీమగా పేరొందిన పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ వెలుగులు నింపేందుకు సిద్ధమైంది. రెండో సొరంగంలో మిగిలిన లైనింగ్ పనులు ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీళ్లు ఉండటంతో.. రెండో సొరంగ పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా నల్లమల సాగర్ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

వెలిగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశంవాసుల కల. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కరువు కోరల్లో చిక్కుకుపోయింది. వర్షాధారం మినహా మరేయిత మార్గం నుంచి ఈ జిల్లాకు నీరు వచ్చే అవకాశమే లేదు. ఇక్కడి భూగర్భ జలాలు తాగడానికి కూడా పనికిరావు. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ రక్కసి ఇప్పటికే ఎన్నో వేల కుటుంబాలను కదిలించింది. వీటన్నింటికి ఏకైక పరిష్కారం వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా? అని వేయికళ్లతో ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే, జిల్లా వాసుల కల నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది.

వెలిగొండ ప్రాజెక్టును అతి త్వరలోనే పూర్తి చేసి, ఈ ప్రాంతానికి నీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా అనేకసార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించి, వీలైనంత త్వరగా ఈ ప్రాంతానికి నీరు అందేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దాంతో ప్రభుత్వం అనుకుంది అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరుకే వెలిగొండలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడం ఖాయం.

జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతున్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి నల్లమలసాగర్‌కు జలాలు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల పరిధిలో విస్తరించిన కొండలను ఆసరాగా చేసుకుని వెలిగొండ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించారు. దీనికి నల్లమల సాగర్‌గా నామకరణం చేశారు. సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల గ్రామాల్లో ఆనకట్టలు కూడా ఏర్పాటు చేశారు.

శ్రీశైలం సమీపంలోని కృష్ణానది కొల్లంవాగు నుంచి ఇక్కడకు జలాలు వచ్చేలా నల్లమల కొండల్లో 18.8 కిలోమీటర్ల నిడివితో రెండు సమాంతర సొరంగాలు కూడా తవ్వారు. అక్కడ నుంచి నల్లమల సాగర్ వరకు 21.8 కిలోమీటర్ల మేర ఫీడర్ కాల్వను నిర్మించారు. రెండో సొరంగం మిగిలిన లైనింగ్ పనులు కూడా పూర్తవ్వనున్నాయి. ఈ నెల 17వ తేదీలోగా ఆ పనులు పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే అయితే, ఈ నెలాఖరుకే వెలిగొండ జలాలు అందుబాటులోకి వస్తాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...