
బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేఫ్‌లో ఆర్డర్ చేసిన అనంతరం ఇచ్చిన బిల్లు రశీదుపై కస్టమర్ పేరును పేర్కొనాల్సి ఉండగా, అతని శారీరక రూపాన్ని ఎగతాళి చేసేలా “లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్” అని ముద్రించారు.
ఈ ఘటనతో తీవ్రంగా మనస్తాపానికి గురైన కస్టమర్, విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో నెటిజన్లు కేఫ్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో కేఫ్ యాజమాన్యం స్పందించి, సదరు కస్టమర్‌కు బహిరంగంగా క్షమాపణలు తెలిపింది.
బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్ ఓ వినియోగదారుడి పట్ల వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. కస్టమర్‌కు ఇచ్చిన బిల్లు రశీదుపై అతని పేరును రాయాల్సి ఉండగా, అందుకు బదులుగా “లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్” అంటూ అతని శారీరక రూపాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్య రాశారు.
దీంతో తీవ్ర అవమానానికి గురైన సదరు వినియోగదారుడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ కేఫ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కూడా కస్టమర్‌కు మద్దతుగా నిలిచారు. కేఫ్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేస్తూ, సదరు వినియోగదారుడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..?
బెంగళూరుకు చెందిన ఫుడ్ కమ్యూనిటీ ‘రెడ్డిట్’ పేజీలో ఓ కేఫ్‌కు సంబంధించిన రశీదు ఫొటో వైరల్‌గా మారింది. ఆ రశీదులో కస్టమర్‌ను గుర్తుపట్టేందుకు అతడి శారీరక రూపాన్ని ఉద్దేశించి సిబ్బంది రాసిన వ్యాఖ్యలు ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
కస్టమర్లను గుర్తించేందుకు సిబ్బంది కొన్ని వివరాలు నమోదు చేయడం సాధారణమే అయినప్పటికీ, ఒక వ్యక్తి శరీరాకృతిని ఆధారంగా చేసుకుని అవమానకరమైన పదాలు ఉపయోగించడం ఏమాత్రం సమంజసం కాదని సదరు కస్టమర్ ఆవేదన వ్యక్తం చేశాడు. పురుషులపై కూడా ఇలాంటి బాడీ షేమింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా చూడటం సరికాదని ఆయన పేర్కొన్నాడు.

