దేశంలో నేతన్నల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: ప్రజలకు మోదీ పిలుపు

Date:

హైదరాబాద్, ఆగస్టు 07: దేశంలో నేతన్నల కటుంబాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని ప్రజలకు ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ప్రధాని మోదీ విడుదల చేశారు. చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని వారిని మోదీ కోరారు. దేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత వస్త్ర పరిశ్రమ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.

శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల కుటుంబాలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. దేశంలో సాగు తర్వాత స్థానం చేనేతదేనని గుర్తు చేశారు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత అని అభివర్ణించారు. ‘లోకల్ ఫర్ వోకల్’తో ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఆగస్ట్ 07వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిన ఘనత మోదీదేనని వివరించారు. దాదాపు 10 కోట్ల మంది ప్రజలు చేనేత రంగంపై ఆధార పడ్డారని ఆయన పేర్కొన్నారు.

భారతీయ చరిత్ర, సంస్కృతి, కళాత్మకతకు చేనేత ప్రతిరూపమని అన్నారు. అగ్గిపెట్టేలో చీర ఇమిడేలా తయారు చేసిన ఘనత ఉమ్మడి కరీంనగర్ జిల్లాదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2 గంటల 50 నిమిషాల్లో ఏకబిగిన అగ్గిపెట్టెలో ఇమిడేలా చీర నేశారని పేర్కొన్నారు. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు రాష్ట్రంలో చేయూత కరువైందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’తో చేనేతను బలోపేతం చేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నేతన్నల వార్షిక ఆదాయాన్ని పెంచేలా కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...