తీరం.. అభివృద్ధికి హారం

Date:

తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్‌గా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే శనివారం వస్తే హైదరాబాద్‌ నుంచి విపరీతంగా పర్యాటకులు చీరాల, సూర్యలంక బాట పడుతున్నారన్నారు. మరో గోవాగా ఇక్కడి తీరాన్ని మార్చబోతున్నామని సీఎం చెప్పారు.

చీరాల పరిధిలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్ని నేత న్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. అన్నీ అనుకూలిస్తే చీరాల పక్కనే ఓ చిన్న ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసి ప్రపంచ పర్యాటకులను ఇక్కడకు రప్పిస్తామన్నారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్‌ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామన్నారు.

చీరాల నియోజ కవర్గంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే కొండయ్య సీఎం దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. చీరాల క్టస్టర్‌ హ్యాండ్‌ లూమ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.15కోట్లు, మున్సిపాలిటీ పరిధిలోని దొండపాడు రోడ్డుకు రూ.20 కోట్లు, చీరాల బీచ్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెం ట్‌కు రూ.30 కోట్లు, మున్సిపాలిటీలో డ్రైనేజీ బాగుకోసం రూ.8కోట్ల ప్రతిపాదనలు సీఎంకు అందగా వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజావేదిక ప్రాంగణంలో చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా బాపట్ల పర్యాటక రంగ అభివృద్ధిపై రూపొందించిన బే ఆఫ్‌ బాపట్ల వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు. జిల్లా ప్రజలు ఈ సైట్‌ ఆధారంగా తమ సూచనలు, సలహాలు ఇవ్వొచ్చని కలెక్టర్‌ సీఎంకు వివరించారు. ఎల్‌ఈపీఎస్‌ స్టాల్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చే శిక్షణ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేతలు రూపొందించిన కుప్పడం చీరాల ప్రదర్శనను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్టాల్స్‌లో ఆసక్తిగా తిలకించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...