“మంత్రులపై పెట్టిన నిఘా.. క్రిమినల్స్‌పై ఏది?” పోలీసులపై మంత్రి టీజీ భరత్ ఘాటు వ్యాఖ్యలు

Date:

టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే పోలీసు నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఏమైందంటూ ప్రశ్నించారు. ఇంతియాజ్ మరణానికి ముందే రిప్ అంటూ పోస్టు పెడితే కనీసం ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కర్నూలు ఎస్పీ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను సీరియస్‌గా తీసుకుని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన కోరారు.

కర్నూలు జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందంటూ మంత్రి టీజీ భరత్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మాట్లాడిన ఆయన, పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతియాజ్ హత్యకు ముందే పోస్టు పెట్టినా కూడా పోలీసుల దృష్టికి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవర్ని కలుస్తున్నారు.. అనే విషయాలు నిఘా అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నప్పుడు.. ఇలాంటి నేరాలకు సంబంధించిన వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.

కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను పక్కా పథకం ప్రకారమే హతమార్చారంటూ మంత్రి భరత్ ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌సీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో వైసీపీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. హత్యకు గురైన ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారన్న ఆయన.. అప్పట్లో కూడా తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ వర్గీయులు ఇంతియాజ్‌ను బెదిరించినట్లు ఆరోపించారు.

హంద్రీనదిలో జరుగుతున్న కబ్జాలను బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించారనే కారణాలతోనే ఇంతియాజ్‌ను హత్య చేశారంటూ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని.. ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని, దానికి తన వద్ద సమాచారం కూడా ఉందంటూ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో పరిస్థితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి కోరారు. నేరస్థుల కదికలపై మరింత నిఘా పెంచాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...