టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బ్యాలెన్స్ బైక్.. ధర ఎంత ? ప్ర‌త్యేక‌త‌లేంటి..?

Date:

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్‌కు మారే ముందు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ నైపుణ్యాలను సహజంగా అభివృద్ధి చేసుకునేలా రూపొందించారు.

ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్‌కు మారే ముందు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ నైపుణ్యాలను సహజంగా అభివృద్ధి చేసుకునేలా రూపొందించారు. అమెరికాలో ఈ బ్యాలెన్స్ బైక్ ధర 225 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.21వేలు)గా ఉంది. టెస్లా ఇప్పటికే పిల్లల కోసం ఆప్టిమస్ యాక్షన్ ఫిగర్, చిన్నారుల దుస్తులు, సైబర్‌క్వాడ్ ఫర్ కిడ్స్, సైబర్‌ట్రక్ రైడ్-ఆన్ టాయ్ వంటి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో బ్యాలెన్స్ బైక్ కూడా చేరింది.

పెడ‌ల్స్‌, చైన్ ఉండ‌వు..

సాధారణ పిల్లల సైకిళ్లతో పోలిస్తే ఈ బ్యాలెన్స్ బైక్‌లో పెడల్స్ లేదా చైన్ ఉండవు. పిల్లలు తమ కాళ్లతో నేలను తట్టి ముందుకు కదులుతూ ప్రయాణిస్తారు. దీంతో బ్యాలెన్స్, స్టీరింగ్ నైపుణ్యాలు సహజంగానే మెరుగుపడతాయని టెస్లా చెబుతోంది. ఈ బైక్ ను 2 నుంచి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు అనుకూలంగా రూపొందించారు. గరిష్టంగా 35 కిలోల బరువును మోస్తుంది. పిల్లల ఎదుగుదలకు అనుగుణంగా ఐదు స్థాయిల్లో సీటు ఎత్తును సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. తేలికపాటి మెగ్నిషియం ఫ్రేమ్ కారణంగా సంప్రదాయ చిన్నారుల సైకిళ్లతో పోలిస్తే దీనిని నియంత్రించడం సులభమని కంపెనీ తెలిపింది. తెలుపు రంగు ఫ్రేమ్, నలుపు రంగు అడ్జస్టబుల్ సీటు, పక్క భాగంలో టెస్లా లోగో, ముందు భాగంలో టి ఎంబ్లమ్‌తో టెస్లాకు ప్రత్యేకమైన మినిమలిస్టిక్ డిజైన్‌ను ఇందులో అందించారు.

ప్రీమియం విభాగంలో పోటీగా..

225 డాలర్ల ధరతో టెస్లా బ్యాలెన్స్ బైక్ ప్రీమియం విభాగాన్ని లక్ష్యంగా నిర్ణ‌యించుకుంది. మార్కెట్లో 100 డాలర్ల కంటే తక్కువ ధరలో లభించే అనేక బ్యాలెన్స్ బైక్‌లు ఉన్నప్పటికీ, డిజైన్, బ్రాండ్ విలువతో టెస్లా ఈ ప్రీమియం విభాగంలో పోటీ పడుతోంది. ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయానికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఉత్పత్తికి భారీ డిమాండ్ ఏర్పడటంతో స్టాక్ పూర్తిగా అయిపోయింది. ప్రస్తుతం ఆసక్తి ఉన్న వినియోగదారులు తదుపరి స్టాక్ కోసం వెయిటింగ్ జాబితాలో చేరుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కాకుండా జీవనశైలి ఉత్పత్తుల విభాగంలో కూడా తన బ్రాండ్‌ను విస్తరించాలనే టెస్లా వ్యూహంలో భాగంగానే ఈ కొత్త బ్యాలెన్స్ బైక్‌ను తీసుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...