హస్త కళాకారులకు డిప్యూటీ సీఎం గుడ్‌న్యూస్.. వుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు!

Date:

హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హస్త కళలు అంతరించిపోకూడదని, వారికి కావాల్సిన కలప అందుబాటులో ఉండాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖ నుంచి కళాకారులకు కావాల్సిన కలపను తక్కువ ధరకు అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆయా హస్త కళల పరిధిలో వుడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆయన చెప్పారు.

హస్తకళ అంతరించకుండా.. వారిని ప్రోత్సహించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనవంతు కృషి చేస్తున్నారు. హస్త కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. హస్త కళాకారులకు అందించే కలపలో లాభాలు చూసుకోకుండా.. కలప సేకరణ, రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన ఆదేశించారు. ముడి సరుకు దొరక్క ఇబ్బందిపడుతున్న హస్త కళాకారులకు వుడ్ బ్యాంకులు వరమవ్వాలని ఆకాంక్షించారు

రాష్ట్రంలో ఆరు క్లస్టర్ల పరిధిలో వుడ్ క్రాఫ్ట్ బ్యాంక్‌ల ఏర్పాటుపై ఆయన అధికారులతో సమావేశమై తగిన సూచనలు చేశారు. కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన కలప జాతుల పునరుత్పత్తి, తోటల అభివృద్ధి చేయాలని చెప్పారు. వారసత్వ కళాకారులకు ఈ వుడ్ బ్యాంక్‌లు ఉపయోగపడాలని ఆదేశించారు. కళాకారులకు ఈ కలపను అందించడంలో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే చెక్కను అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాలు అంచనా వేయాలని, కలప లభ్యతను శాస్త్రీయంగా మ్యాపింగ్ చేయాలని.. తక్కువగా దొరికే అంకుడు, తెల్లపొణికి చెట్లను అటవీశాఖ నర్సరీల్లో పెంచాలంటూ పవన్ కళ్యాణ్ సూచించారు. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల డిజైన్, నిర్వహణలో ఒకే నమూనా పాటించాలని చెప్పారు. కొండపల్లి, ఏటికొప్పాక, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, ఉదయగిరి, బొబ్బిలి, రాజమండ్రి, ఏలూరు పరిధిలో ఈ వుడ్ బ్యాంక్‌లు ఏర్పాటు చేయనున్నారు.

కొండపల్లి బొమ్మల తయారీకి తెల్లపొణికి కలప అవసరం కాగా.. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్ట్స్‌ను వుడ్ బ్యాంక్‌గా మార్చారు. లక్కబొమ్మల కళాకారులకు ఏటికొప్పాకలో ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకుని అక్కడ అంకుడు కర్రను కొయ్యబొమ్మల కళకారులకు విక్రయించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...