డిజిటల్ గ్రంథాలయం.. స్కాన్ చెయ్, నచ్చిన పుస్తకం చదివెయ్!

Date:

గ్రంథాలయాలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇకపై మనం ఆన్‌లైన్‌లోనే మనకు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టు గ్రంథాలయ శాఖ కూడా డిజిటల్ బాట పట్టింది. ప్రతి గ్రంథాలయం వద్ద ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.. దాన్ని స్కాన్ చేస్తే నచ్చిన పుస్తకాన్ని చదువుకునే అవకాశం ఉంది. ఏ గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి.. ఒకవేళ తనకు కావాల్సిన పుస్తకం అక్కడ లేకపోతే జిల్లాలోని ఏ గ్రంథాలయంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.

ఒకప్పుడు గ్రంథాలయాలు ఎంత కళకళలాడుతుండేవో కదా. రిటైర్డ్ అయిన వాళ్లు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు.. ఇలా అందరూ ఆ గ్రంథాలయాల్లోనే కనిపించేవారు. అయితే, మొబైల్ చేతికొచ్చాక ఇక గ్రంథాలయాల మొహం చూసే వారే తగ్గిపోయారు. దాంతో మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలు కూడా డిజిటల్ బాట పట్టాయి. పుస్తక పఠనానికి ఎక్కువ మందిని అలవాటు చేసే దిశగా గ్రంథాలయాల శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది.

ప్రతి గ్రంథాలయం వద్ద ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి.. దాన్ని స్కాన్ చేస్తే నచ్చిన పుస్తకాన్ని చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఏ గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి.. తాము కోరుకున్న పుస్తకం అందుబాటులో ఉందా? లేక జిల్లాలోని ఏ గ్రంథాలయంలో లభిస్తుందనే వివరాలతో పాటు వాటి సేవలపై సమగ్ర సమాచారం డిజిటల్ విధానంలో ఆగస్టు 1వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలయిన గుంటూరు, పల్నాడు, బాపట్లలోని 98 గ్రంథాలయాల్లో క్యూ ఆర్ కోడ్‌తో పుస్తక పఠనానికి అవకాశం కల్పించారు. ఆయా గ్రంథాలయాల్లోని పుస్తకాలన్నింటినీ డిజిటలైజేషన్ చేస్తున్నారు. పోటీ పరీక్షలు, చరిత్ర, సాహిత్యానికి సంబంధించినవి ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి.

యువతను గ్రంథాలయాల బాట పట్టించేందుకు ఏపీ గ్రంథాలయ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. గ్రంథాలయాల వద్ద క్యూ ఆర్ కోడ్‌ను అతికించారు. గ్రంథాలయాల వద్ద ఉండే వారి నుంచి లింకు తీసుకున్ని దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. విజిటర్స్ లాగిన్‌పై క్లిక్ చేసి బార్ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ కోడ్ స్కాన్ చేస్తే సక్సెస్ మెసెజ్ వస్తుంది. రోజుకు ఎంతమంది గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదివి వెళ్తున్నారనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు.

యాప్‌లో అన్ని వివరాలు ఉంటాయి. రచయితలు, అంశాల వారీగా పుస్తకాల వివరాలు తెలుసుకునే అవకాశం క్యూ ఆర్ కోడ్‌తో ఉంది. తాము వెతుకుతున్న పుస్తకం అందుబాటులో ఉందా? లేదా? అన్నది కూడా యాప్‌లో ఉంటుంది. ఆ పుస్తకం జిల్లాలోని ఏ గ్రంథాలయంలో ఉందనే సమాచారం ఏపీ గ్రంథాలయ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...