ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు

Date:

ఏపీ ప్రభుత్వం 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (Recognition of Service Associations) Rules, 2001 లోని రూల్ 3(2)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించారు. ఒకేసారి 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని ఉద్యోగ సంఘాల కొన్నేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు.. అందుకే ఆ ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సర్వీస్ అసోసియేషన్ల గుర్తింపు) నిబంధనలు, 2001 — రూల్ 3(2)(e) కింద గుర్తింపును రద్దు చేశారు.

1. అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్
2. ఏపీ యునాని మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్
3. ఆంధ్రప్రదేశ్ సచివాలయ రికార్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్
4. ఏపీ సచివాలయ క్లాస్-IV ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్
5. ఏపీ సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్
6. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్
7. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్
8. ఏపీ విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్
9. ఏపీ గ్రామ పంచాయతీల ఎగ్జిక్యూటివ్ (గెజిటెడ్) అసోసియేషన్
10. ఏపీ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కోచింగ్ స్టాఫ్ అసోసియేషన్
11. ఏపీ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ (గెజిటెడ్) సర్వీస్ అసోసియేషన్
12. ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీస్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్
13. ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషన్
14. ఇరిగేషన్, లాక్స్ అండ్ వర్క్స్ సూపరింటెండెంట్స్ అసోసియేషన్
15. ‘ద ఏపీ సర్వే ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’
16. ‘ద అసోసియేషన్‌ ఆఫ్‌ హానరరీ మెడికల్‌ ఆఫీసర్స్‌-ఏపీ’
17.. ‘ద పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌’
18.‘ద ఏపీ పోలీస్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’ వంటి మొత్తం 29 సంఘాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏపీపీటీడీ (ఆర్టీసీ) జేఏసీ ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ నాయకులు ఏపీ జేఏసీని కలిశారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్, ఏపీఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి తీసుకురావడం మంచిదేనని.. వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బందితో నడపాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...