
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ దిగ్గజం Oracleలో మరోసారి ఉద్యోగాల కోతలకు సంబంధించిన వార్తలు వెలువడ్డాయి. AI మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్న సంస్థ ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా కొత్త రౌండ్ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇప్పటికే 2026 ఆర్థిక సంవత్సరంలో Oracle ఉద్యోగుల సంఖ్య సుమారు 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 21 వేల మంది ఉద్యోగులు తగ్గినట్లు కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. AI టెక్నాలజీల వినియోగం, సంస్థ పునర్వ్యవస్థీకరణ కారణంగా ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని Oracle తన ఫైలింగ్‌లో పేర్కొంది.
తాజా నివేదికల ప్రకారం, మరో విడత ఉద్యోగుల కోతలకు సంబంధించి మేనేజర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రౌండ్‌లో ఖచ్చితంగా ఎంతమంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందనే విషయంపై అధికారిక సంఖ్య ఇంకా వెల్లడికాలేదు.
AIపై భారీ పెట్టుబడులు, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణతో Oracle వ్యాపార వ్యూహంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు AI, క్లౌడ్ సేవలపై ఖర్చులు పెంచుతూనే.. మరోవైపు ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

