అమరావతి ప్రాజెక్టులపై కీలక చర్చ

Date:

D news: మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పవన్‌ను ఆహ్వానించారు.

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు నారాయణ తెలిపారు.

రాజధాని మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్న మంత్రి నారాయణను పవన్ కల్యాణ్ అభినందించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.

విశాఖలో గురువారం నిర్వహించనున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్నందున అమరావతి కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తెలిపారు. తన అభ్యర్థన మేరకు విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కూడా కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...