
D news: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని చాటేలా విజయవాడ భవానిపురంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు.
త్రివర్ణ పతాకాలు చేతబూని, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో విద్యార్థులు, ఎన్డీయే కూటమి నేతలు, స్థానికులతో కలిసి ఎమ్మెల్యే సుజనా ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఈ ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌తో పాటు కూటమి నేతలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

