చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

Date:

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు నాటికి కనీసం 2 టీఎంసీల కృష్ణా జలాలు చెన్నైకి చేరే అవకాశం ఉందని తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

కృష్ణా జలాశయాల్లో మొత్తం 68.03 టీఎంసీలకు గాను ప్రస్తుతం సుమారు 14 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ చెన్నై జలాశయాల నిల్వలను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నీటి విడుదలను పెంచిందన్నారు. అవసరమైతే తమ విజ్ఞప్తి మేరకు విడుదలను 500 క్యూసెక్కుల వరకు పెంచే అవకాశం ఉందని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 25న కండలేరు డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయగా, మార్చి 4న తమిళనాడులోని పూండి జలాశయానికి చేరింది. రిజర్వాయర్‌ నిర్వహణ పనుల కారణంగా మార్చి 29న విడుదల నిలిపివేశారు. అనంతరం మే 15 నుంచి 180-200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తూ వచ్చారు.

సాధారణంగా జూలై నుంచి అక్టోబర్‌ మధ్య చెన్నైకి 2 టీఎంసీల కృష్ణా జలాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి ఆగస్టు చివరి నాటికి 2 టీఎంసీలకు పైగా నీరు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదనపు నీటితో చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కొరతను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...