కేంద్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: చింతామోహన్‌

Date:

కర్నూలు రూరల్‌ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్‌ డిమాండ్‌ చేశారు. కర్నూలులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.

బీజేపీ పాలనలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అప్పుల భారం పెరిగాయని ఆరోపించారు. పేదల కంటే కార్పొరేట్లకు కేంద్రం మేలు చేస్తోందని విమర్శించారు.

రుణమాఫీలపై ఆరోపణలు

గత 12 ఏళ్లలో బ్యాంకులు రూ.16 లక్షల కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయని చింతామోహన్‌ ఆరోపించారు. పెద్ద రుణగ్రహీతలకు ప్రయోజనం కల్పించారని విమర్శించారు. రూ.15 లక్షల నల్లధనం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీలను బీజేపీ నెరవేర్చలేదని అన్నారు.

రాజ్యాంగంపై హెచ్చరిక

రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు దేశ సమైక్యతకు ముప్పుగా మారతాయని చింతామోహన్‌ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో విభజన భావనలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.

ఏపీలో అవినీతి పెరిగిందని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో పేదల భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ప్రతి ఫైల్‌కు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

కాపులు కాంగ్రెస్‌లోకి రావాలి

కాపులు, బలిజలు కాంగ్రెస్‌లోకి రావాలని చింతామోహన్‌ పిలుపునిచ్చారు. 2029లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కాపులు, బలిజలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...