
ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి చేసిన తుంటరి పని తీవ్ర కలకలానికి దారితీసింది. తన వాటర్ బాటిల్లో మూత్రం కలిపిన నీటిని అదే తరగతికి చెందిన ఇద్దరు బాలికలతో తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం నీటిలో మూత్రం కలిసిన విషయం గుర్తించిన బాలికలు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు.
అయితే ప్రిన్సిపాల్ ఈ ఘటనపై నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపణలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తన వాటర్ బాటిల్లో మూత్రం కలిపి, దానిని ఇద్దరు తోటి విద్యార్థినులతో తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
నీటిలో మూత్రం కలిసిన విషయం గుర్తించిన బాలికలు ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, బాధిత బాలికల ఫిర్యాదుపై ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. నోరు చేదుగా అనిపిస్తే రూ.10 విలువైన చాక్లెట్ తిని సరిపెట్టుకోవాలంటూ ఆయన చెప్పినట్లు సమాచారం.
గుణా జిల్లాలోని ఆరోన్ డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేశారు.

