Guntur: ఆకతాయిలు అల్లరి చేస్తున్నారంటూ ఫోన్ ఒంటరిగా బైక్‌పై వెళ్లిన ఎమ్మెల్యే ఆ తర్వాత..

Date:

  • గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆకతాయిలు అల్లరి స్థానికులకు ఇబ్బందిగా మారింది.
  • గంజాయి సేవిస్తున్నట్లు స్థానికం అనుమానించారు. దీంతో ఆకతాయిలు అల్లరి, గంజాయి సేవించడంపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ చేసి చెప్పారు. ఆకతాయిలు అల్లరి స్థానికులకు న్యూసెన్స్ గా మారిన విషయాన్ని చెప్పేశారు. ఇక అంతటితో తమ పని అయిపోయిందని స్థానికులు గమ్మనుండిపోయారు.‌
  • అయితే ఫోన్ చేసిన పది నిమిషాలకే గల్లా మాధవి ఆ స్థలంలో వాలిపోయారు‌. బైక్ పై సర్రున దూసుకొస్తున్న ఎమ్మెల్యే ను చూసిన ఆకతాయిలు అక్కడి నుండి పారిపోయారు‌.‌ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వచ్చిన విషయం క్షణాల్లోనే చేరిపోయింది. దీంతో ఎమ్మెల్యే కి ఫోన్ చేసిన మహిళా వచ్చి.. ఆకతాయిలు ఆట కట్టించాలని చెప్పింది. ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నిఘా పెట్టాలని సూచించింది. గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించింది.
  • ఫోన్ కాల్ కే స్పందించి వచ్చిన ఎమ్మెల్యే ను స్థానికులు అభినందించారు. గతంలోనూ పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో నిర్మానుష ప్రాంతానికి పోలీసులతో వెళ్ళి పేకాట రాయుళ్లు, గంజాయి ముఠాని పట్టించారు. సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆమె స్పందిస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...