తెలంగాణలో స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. కలెక్టర్ శాలరీ కంటే ఎక్కువ, ఎందుకలా..?

Date:

చెప్రాసి అయినా సరే సర్కార్ నౌకరి ఉండాలని పెద్దలు అంటుంటారు. అందుక్కారణం ఉద్యోగ భద్రత, టైంకి వచ్చే జీతం. నిజమే.. ఈ స్వీపర్ నెల జీతం గురించి తెలిస్తే అటెండర్ ఉద్యోగం అయినా ఓకే అంటారు. ఎందుకంటే కలెక్టర్ జీతం కంటే ఎక్కువగా నెలకు రూ. 2 లక్షలు జీతం వస్తుంది మరి. ఈ విషయాన్ని సాక్షాత్తూ తెలంగాణ సీఎస్ వెల్లడించారు.

తెలంగాణలో  నెల జీతం రూ.2 లక్షలు. అవును మీరు విన్నది అక్షరాల నిజం. స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీనియర్ ఐఏఎస్‌ల జీతం రూ.1.5 లక్షల వరకు ఉంటే.. సీనియర్ స్వీపర్ జీతం మాత్రం రూ.2 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ విషయాన్ని ఎవరో కాదు సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తోన్న సీనియర్ స్వీపర్ జీతం రూ.2లక్షల వరకూ ఉందని సీఎస్ తెలిపారు. ఇలా జీతం ఉండటానికి కారణం వరుస పీఆర్సీలేనని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెలా రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బుధవారం (ఫిబ్రవరి 25) జరిగిన రివ్యూ మీటింగ్‌లో తెలిపారు. 2014లో ఇది కేవలం 1500 కోట్లుగా ఉండేదని ఇప్పుడు రూ.6 వేల కోట్లకు చేరిందన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...