RRB ALP Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పూర్తి వివరాలివే

Date:

భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే జోన్లలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

మొత్తం 11,127 ఏఎల్‌పీ పోస్టుల భర్తీ రైల్వే శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదలకు సన్నాహాలు చేస్తుంది. మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో 674 ఉద్యోగాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితో పాటు ఐటీఐ (ITI) లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అందిన సమాచారం మేరకు ఆర్ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నోటిఫికేషన్‌ ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...