బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ!

Date:

ఐపీఎల్‌లో తన బ్యాటింగ్‌తో సంచలనం సృష్టించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఈ 15 ఏళ్ల యువ ఆటగాడు బంతితో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.

నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ కాగా.. ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలోఆన్ ఆడాల్సి వచ్చింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ నార్త్ ఈస్ట్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 27వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్ వైభవ్ తన ప్రభావం చూపించాడు.

ఓవర్ రెండో బంతికే కిషన్ లింగ్డోను 25 పరుగుల వద్ద ఔట్ చేసిన వైభవ్.. ఐదో బంతికి ఇమ్లివాటి లెమూర్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మొత్తంగా మూడు ఓవర్లు వేసిన వైభవ్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులకే ఔటయ్యాడు.

మరోవైపు నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బ్యాటింగ్‌లో ఇప్పటికే సత్తా చాటిన వైభవ్.. ఇప్పుడు బౌలింగ్‌లోనూ తనలోని మరో కోణాన్ని చూపించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Food Safety: ఆన్‌లైన్‌లో ఈ పండు కనిపిస్తే జాగ్రత్త.. ఈ-కామర్స్ సంస్థలకు FDA భారీ షాక్!

ఆన్‌లైన్ షాపింగ్‌ ద్వారా అవసరమైన వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు. అయితే...

సుజ్లాన్ S144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్

https://www.youtube.com/watch?v=1zGJfDlgPvg D-News: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో ముందడుగు పడింది. సుజ్లాన్...

గులాబీ మొక్క కొమ్మ కొమ్మకీ మొగ్గలు రావాలంటే.. ఈ ఒక్క స్పూన్ వేయండి! నర్సరీలో పాటించే చిట్కా ఇదే.

ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు....

పాస్‌వర్డ్ కంటే ఇదే సేఫ్‌.. స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీపై అసలు నిజం ఇదే!

స్మార్ట్‌ఫోన్‌కు సురక్షితమైన స్క్రీన్ లాక్ ఏది? స్మార్ట్‌ఫోన్‌ నేడు మన రోజువారీ జీవితంలో...