దేశ యువతకు ప్రధాని మోదీ కీలక సందేశం.. ఖేలో ఇండియా డైలాగ్‌లో దిశానిర్దేశం..!

Date:

జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా దేశ యువతతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .గురువారం (ఆగస్టు 27) ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్ ప్రధాని మోదీ కే సాథ్ కార్యక్రమంలో యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యా సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో యువ సంవాద్ నిర్వహిస్తారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా దేశ యువతతో మాట్లాడనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .గురువారం (ఆగస్టు 27) ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్ ప్రధాని మోదీ కే సాథ్ కార్యక్రమంలో యువతతో వర్చువల్‌గా మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా 1,500కు పైగా విద్యా సంస్థల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి జిల్లాలోని రెండు కళాశాలల్లో యువ సంవాద్ నిర్వహిస్తారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్, ప్రముఖ వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సహా అనేక సంస్థలు పాల్గొంటున్నాయి.

ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. క్రీడలు, యువత సాధికారత, ఫిట్‌నెస్, యువ నాయకత్వం, వికసిత్ భారత్ నిర్మాణం అంశాలపై ప్రధాని యువతతో ముఖాముఖి మాట్లాడనున్నారు. యువ క్రీడాకారుల అనుభవాలు, అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. క్రీడా మౌలిక వసతులు, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రతిభావంతుల గుర్తింపు, క్రీడాకారుల శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. యువ నాయకత్వం, స్వచ్ఛంద సేవలు, భవిష్యత్ నైపుణ్యాలు, పౌర బాధ్యత వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుంది.

ప్రముఖ భారత క్రీడాకారులు, పతక విజేతలు, దేశ యువతతో ప్రధాని మోదీ ప్రత్యక్షంగా మాట్లాడతారు. మేరీ కామ్, సైనా నెహ్వాల్, పి.టి. ఉషా, దీపా కర్మాకర్, గగన్ నారంగ్, శ్రీజేష్, బైచుంగ్ భూటియా, పుల్లెల గోపీచంద్, అంజు బాబీ జార్జ్, కరణం మల్లేశ్వరి, మీరాబాయి చాను తదితరులు పాల్గొంటారు. యువత సూచనలు MY Bharat పోర్టల్ ద్వారా సేకరించి విధాన రూపకల్పనలో ఉపయోగిస్తారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్‌లో పాల్గొనాలని, MY Bharatలో నమోదు కావాలని యువతను ప్రోత్సహిస్తారు.

నషా ముక్త్ యువ

నషా ముక్త్ యువ ఉద్యమంపై యువతతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. క్రీడల ద్వారా యువతను మాదకద్రవ్యాల వ్యసనానికి దూరంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువత ఆకాంక్షలు జాతీయ క్రీడా విధానంలో భాగం కావాలని, ఫిట్, క్రమశిక్షణతో కూడిన క్రీడా దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశం ఇవ్వనున్నారు.యువత ఆధ్వర్యంలో వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ ఖేలో ఇండియా డైలాగ్ ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Papaya Health Alert: బొప్పాయి అందరికీ మంచిది కాదు.. వీరు తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం!

ఏడాది పొడవునా సులభంగా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. బరువు తగ్గాలని...

క్యాలీఫ్లవర్ రుచితో పాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే ఆరోగ్యకరమైన...

కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే.. ఈ ఒక్కటి వేస్తే చాలు!

కరివేపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించండి భారతీయ వంటకాలకు ప్రత్యేకమైన...

రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. రాఖీ ఎప్పుడు కట్టాలి? పంచాంగం ఏం చెబుతోంది?

అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, తోబుట్టువుల ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచే పవిత్ర వేడుక రక్షాబంధన్....