కేపీహెచ్‌బీలో గజం రూ.2.65 లక్షలు.. కళ్లు చెదిరే వేలం, హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం

Date:

కేపీహెచ్‌బీలో గజం భూమి రూ.2.65 లక్షలు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ వేలంలో.. భారీ ధర పలికి రికార్డుల్లోకి ఎక్కింది. 4 ప్లాట్లు, 8 ఫ్లాట్లు విక్రయించడంతో హౌసింగ్ బోర్డు ఖజానాకు ఏకంగా రూ.24.26 కోట్లు వచ్చి చేరాయి. గత కొన్ని రోజులుగా ఖాళీ ప్లాట్ల విక్రయం హైదరాబాద్ నగరంలో భారీ ధర పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గజం లక్షల్లో పలుకుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ( కేపీహెచ్‌బీ )లో ఉన్న భూములకు వేలం నిర్వహించగా.. కళ్లు చెదిరే మొత్తంలో ఆదాయం లభించింది. ఏకంగా రూ.24.26 కోట్ల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ప్లాట్‌లో గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలు పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు వేలం నిర్వహిస్తుండగా.. రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి.

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలకు చేరుకోవడం నగర రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపుతోంది. ఈ వేలంలో భారీగా బిడ్డర్లు పాల్గొనడంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఎవరూ ఊహించని ధరలు పలికాయి. ఈ ప్లాట్‌లకు కనీస అప్‌సెట్ ధర గజానికి రూ.1.30 లక్షలుగా హౌసింగ్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వేలంలో బిడ్డర్లు పోటా పోటీగా పాట పాటడంతో చివరికి గజం ధర రూ.2.65 లక్షల వద్ద ముగిసింది. అయితే కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదే అని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...