బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు విదేశీ అతిథులు ఢిల్లీకి చేరుకోవడం ప్రారంభమైంది. సదస్సుకు హాజరయ్యే వివిధ దేశాల అధినేతలు, ప్రధానులు, విదేశాంగ మంత్రుల వివరాలతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు.

ఈ నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు, భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టారు

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం–2026కు ఢిల్లీ వేదిక కానుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో దేశ రాజధానిలో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల అధినేతలు, ప్రధాన మంత్రులు, విదేశాంగ మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఢిల్లీకి చేరుకోనున్నారు.

సెప్టెంబర్ 10న ప్రారంభమైన విదేశీ అతిథుల రాక సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రముఖుల పూర్తి జాబితాను భారత అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. అగ్రనేతల రాక నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో పలువురు దేశాధినేతలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వారిలో బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ (AIIB) చైర్మన్ ఝూ జియాయీ, ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB) అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఉన్నారు.

అలాగే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, నైజీరియా వైస్ ప్రెసిడెంట్ సెనేటర్ కాశీం శెట్టిమా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి, యూఏఈ అబుదాబి యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ, బురుండి అధ్యక్షుడు ఎవరిస్తే న్డైషిమియే, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్. మార్కోస్ జూనియర్ తదితరులు పాల్గొననున్నారు.

ఇక క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ పరిల్లా, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) డైరెక్టర్ జనరల్ డా. న్గోజీ ఒకోంజో-ఇవేలా, బెలారస్ విదేశాంగ మంత్రి మాగ్జిమ్ రైజెంకోవ్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డా. అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కజికిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టోకేవ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *