పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU)లో గ్యాంగ్‌రేప్, ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సుమారు 2 వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి క్రమంగా హింసాత్మకంగా మారింది.

ఆందోళనలో భాగంగా కొందరు విద్యార్థులు క్యాంపస్‌లోని కిటికీలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పు పెట్టారు. అనంతరం జలంధర్–ఫగ్వారా జాతీయ రహదారిపైకి చేరుకుని రహదారిని దిగ్బంధించారు.

అయితే, అత్యాచారానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని, ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు వెల్లడించారు. మరోవైపు, యూనివర్సిటీ యాజమాన్యం కూడా గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ప్రచారాన్ని ఖండిస్తూ, అవన్నీ నిరాధారమైన వార్తలని పేర్కొంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన నిర్ధారణ లేని పోస్టులు పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో తీవ్ర ఉద్రిక్తతకు, విధ్వంసానికి దారితీశాయి. ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఫగ్వారా ప్రాంతంలోని ఎల్‌పీయూ క్యాంపస్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సుమారు 2,000 మంది విద్యార్థులు లేడీస్ హాస్టల్ సమీపంలో గుమిగూడి నిరసన చేపట్టారు. తొలుత నినాదాలు, ఆందోళనలకే పరిమితమైన నిరసన క్రమంగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం కొందరు విద్యార్థులు క్యాంపస్‌లోని కిటికీ అద్దాలు, ఫ్లవర్ పాట్స్, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు సమాచారం.

క్యాంపస్‌లోని కొన్ని వస్తువులు, భవనంలోని కొన్ని ప్రాంతాలకు నిప్పు పెట్టిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, విద్యార్థినిపై అత్యాచారం, ఆత్మహత్యకు సంబంధించిన సోషల్ మీడియా ఆరోపణలను పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించలేదు.