
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పురుషుల క్రికెట్ జట్టు నగోయాకు చేరుకుంది. శనివారం టోక్యోకు చేరుకున్న భారత ఆటగాళ్లు.. అక్కడి నుంచి నగోయాకు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ ప్రయాణ అనుభవాలను పంచుకున్నారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత జట్టు.. సోమవారం అఫ్గానిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తో ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.
