అమరావతిలో బిట్స్ పిలానీ.. 2 దశల్లో 7 వేలమంది విద్యార్థులకు అవకాశం..

Date:

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ ప్లాన్లు పరిశీలించారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ ఎదుట నిర్మాణ ప్లాన్లు ప్రదర్శించారు బిట్స్ ప్రతినిధులు. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేశారు నారా లోకేష్. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఏపీ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అమరావతిలో చేపడుతున్న బిట్స్‌పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణ ప్రణాళికలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం పరిశీలించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసిన బిట్స్‌పిలానీ ప్రతినిధులు.. బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్‌లను చూపించారు. డిజైన్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి కోర్సులు అమరావతి బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఉంటాయని బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌కు వివరించారు.

అమరావతి క్యాంపస్ ద్వారా రెండు దశలలో ఏడువేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా నిర్మాణాలు చేపడుతున్నట్లు బిట్స్ పిలానీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ మీద రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. నెక్ట్స్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నామని.. ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు నారా లోకేష్‌కు వివరించారు. గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి పర్యావరణహిత విధానాలను క్యాంపస్ నిర్మాణంలో అనుసరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిట్స్‌పిలానీ క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్‌గా ఉంటుందని వెల్లడించారు.

అగ్రికల్చర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు అమరావతి బిట్స్‌ క్యాంపస్‌లో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌కు బిట్స్ పిలానీ ప్రతినిధులు వివరించారు. నిర్మాణ ప్లాన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభమయ్యేలా చూడాలని కోరారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...