అన్నదాత సుఖీభవ: అకౌంట్లోకి డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండిలా..

Date:

ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.4000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్తం ఆరు వేలు విడుదల చేశారు. స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు విడతల్లో రూ.6,309 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మూడోవిడత కింద మరో రూ.2675.97 కోట్లను అర్హులైన 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో శుక్రవారం జమ చేసింది. ఈ నేపథ్యంలో చెప్పిన మాట ప్రకారం అన్నదాతలకు అండగా పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాది మూడు విడతలు కలిపి ప్రతి రైతుకు రూ.20 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం రూ.8,985 కోట్లు రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.

మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో.. రైతులు తమ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడ్డాయా లేదా.. ఏ బ్యాంకులో పడ్డాయనే సంగతిని స్టేటస్ చెక్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే.. హోం స్ర్కీన్ మీద.. Know Your Status అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు నంబర్ వివరాలను నమోదు చేయాలి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

హైడ్రా భారీ ఆపరేషన్‌.. రూ.15 వేల కోట్ల 863 ఎకరాల రక్షణకు చర్యలు.. 6 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

హైదరాబాద్‌లో హైడ్రా అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.15...

తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన లడ్డూ ప్రసాదం విక్రయాలు.. ఏడాదిలో ఎన్నో తెలుసా!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-2026కు...

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు.. ఎక్కడెక్కడ వస్తాయంటే!

ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో 19 ఇంటర్‌ఛేంజ్‌లు ప్లాన్...

ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన...