D news: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చేసే కొన్ని వ్యాఖ్యలు తరచూ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందించడం, మీమ్స్‌, ట్రోల్స్‌ వైరల్‌ కావడం తెలిసిందే.

ఇటీవల ఓ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ విశాఖపట్నం ప్రాంతంలో వరుణ దేవుడి కరుణతో భారీ వర్షం కురిసిందని ఆయన పేర్కొన్నారు.

‘‘వర్షపాతం తక్కువగా పడింది. కానీ విశాఖపట్నం ప్రాంతంలో వరుణ దేవుడు కూడా కరుణించాడు. నేను వెళ్లి, మేమంతా ప్రార్థిస్తే ఒక్కరోజే 27 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే వరుణ దేవుడికి కూడా మన మీద ఉన్న కరుణ’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు, మీమ్స్‌ చేస్తున్నారు.

By Ramya