ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల లోకేశ్‌తో నిర్వహించిన ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జాతీయ అంశాలు, రాజకీయాలతో పాటు పలు కీలక విషయాలపై ఇద్దరూ చర్చించారు.

ఈ సందర్భంగా లోకేశ్ స్పందించిన తీరును రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు. ముందస్తుగా ప్రశ్నలు పంపకుండా ఇంటర్వ్యూకు హాజరయ్యే నాయకులతో మాట్లాడటం ఎప్పుడూ సులభంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో చాలామంది నాయకులు ఇదే విధంగా వ్యవహరించేవారని, అయితే ప్రస్తుతం ఇది అరుదైన విషయంగా మారిందని వ్యాఖ్యానించారు.

తాను సంధించిన కఠినమైన ప్రశ్నలకు లోకేశ్ ఎలాంటి ముందస్తు స్క్రిప్ట్ లేకుండా సూటిగా సమాధానాలు ఇచ్చారని రాజ్‌దీప్ తెలిపారు. ఇతర నాయకులు కూడా లోకేశ్‌ను చూసి ఈ విషయంలో నేర్చుకోవాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, రాజ్‌దీప్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ముందస్తు స్క్రిప్ట్ లేకుండానే సమాధానాలు ఇచ్చినట్లు నారా లోకేశ్ తెలిపారు. ఈ ముఖాముఖిలో ఏపీ అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, సమకాలీన రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య విస్తృతంగా చర్చ సాగింది.

By Rajini