Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

Date:

ఆదివారం నాటి మరాఠ్వాడ నుంచి ఉత్తర అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర తీరప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

అంతేకాదు ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం

సోమవారం, మంగళవారం :- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ & యానాంలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. ఆ తదుపరి 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...